
ఫొటోగ్రఫీ జర్నలిజంతో చైతన్యం
సంగారెడ్డి జోన్: ఫొటోగ్రఫీ జర్నలిజంతో ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను వినియోగిస్తూ ఫొటోగ్రఫీ మరింత విస్తరించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌లు నిర్వహించి మెళకువలు నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ౖఫైసల్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి, ఫొటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం