
రెండేళ్ల నుంచి మంచి ఆదాయం
50 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్న. దిగుబడి బాగానే వస్తుంది. మూడేళ్ల క్రితం నష్టాలు చవిచూశాం. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ నుంచి వ్యాపారులు వచ్చి సరైన ధరకు కొంటున్నారు. మూడేళ్ల క్రితం రూ.4 కిలో అమ్ముడు పోగా ఇప్పడు రూ.20 కిలో చొప్పున కొంటున్నారు.
– నల్ల నాగేశ్వర్ రెడ్డి, రైతు, రంజోల్
మంచి డిమాండ్ ఉంది
అరటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. జహీరాబాద్ డివిజన్ పరిధిలో అనుకూల వాతావరణం ఉన్నందన మంచి దిగుబడులు వస్తాయి, ఈ ప్రాంతంలో అరటి విస్తీర్ణం ఎప్పుడు తగ్గడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తున్నందున సాగు విస్తీర్ణం పెరుగుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే అరటి సాగులో అధిక లాభాలు సాధించవచ్చు. పంట సాగు విషయంలో అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేపట్టి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.
– పండరి, ఉద్యానశాఖ అధికారి, జహీరాబాద్

రెండేళ్ల నుంచి మంచి ఆదాయం