వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ అనురాధ | - | Sakshi
Sakshi News home page

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ అనురాధ

Aug 19 2025 8:15 AM | Updated on Aug 19 2025 8:15 AM

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ అనురాధ

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ అనురాధ

సిద్దిపేటకమాన్‌: రాబోయే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ అనురాధ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వివిధ శాఖల అధికారులతో కలిసి పోలీసు సిబ్బంది సమష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పోలీసులు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల ఎవరికై నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డయల్‌ 100 లేదా పోలీసు కమిషనరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 8712 667 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఇళ్లు కూలి..

ముగ్గురికి గాయాలు

పుల్‌కల్‌(అందోల్‌): భారీ వర్షాలకు మండలంలోని పాత ఇళ్లు కూలుతున్నాయి. పత్తికుంట తండా, పోచారం గ్రామంలో సోమవారం ఇళ్లు కూలడంతో ముగ్గురు గాయపడ్డారు. పత్తికుంట తండాలో తేజావత్‌ జితేందర్‌ ఇళ్లు కూలి మట్టి పెళ్లలు మీద పడటంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు సునీత, కార్తీక్‌కు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను ఎస్‌ఐ విశ్వజన్‌ , ఎంపీఓ వేంకటేశ్వర్‌ రెడ్డి పరామర్శించారు. బాధితులకు కొత్త ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు

పాపన్నపేట(మెదక్‌): జిల్లాలో కల్తీకల్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీటీఎఫ్‌ సీఐ గోపాల్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని గాజులగూడెం, కొత్తపల్లి, అన్నారం, అబ్లా పూర్‌, పూసూఫ్‌పేట, కొడపాక, పొడ్చన్‌పల్లి, కుర్తివాడ, నార్సింగి గ్రామాల్లోని కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. కల్తీ కల్లు విక్రయించడం నేరమని, దుకాణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పలు కల్లు దుకాణాల్లో సేకరించిన షాంపిళ్లను పరీక్షల నిమిత్తం మెదక్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌లో అప్పగించనున్నట్లు తెలి పారు. ఎస్‌ఐ బాలయ్య, హెడ్‌ కానిస్టేబుళ్లు చంద్రయ్య, ఎల్లయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

హుస్నాబాద్‌రూరల్‌: రోరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా... స్థానికుల కథనం ప్రకారం... అక్కన్నపేట మండలం కేశాపూర్‌కు చెందిన అఖిల్‌ (25) హుస్నాబాద్‌ నుంచి బైక్‌పై గ్రామానికి వెళుతున్నాడు. పోతారం(ఎస్‌) క్రాసింగ్‌ దగ్గర వర్షానికి బైక్‌ అదుపు తప్పిరోడ్డు పక్కన ఉన్న కందకంలో పడటంతో తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులు చూసి 108కి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

చిన్న వ్యాపారాలపై సర్వే

మెదక్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో సోమవారం కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయం కరీంనగర్‌ బృందం సర్వే నిర్వహించింది. వ్యవసాయేతర రంగంలోని చిన్న వ్యాపారాల ఆర్థిక పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ సర్వే చేపట్టినట్లు అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అసంఘటిత సేవా రంగం, అసంఘటిత భవన నిర్మాణాలపై అయ్యే ఖర్చులపై సర్వే నిర్వహించారు. బృంద సభ్యులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

గృహిణి ఆత్మహత్య

మెదక్‌ కలెక్టరేట్‌: గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి హవేళిఘణాపూర్‌ మండలం బూర్గుపల్లి గ్రామంలో చోటు చేసు కుంది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన ఇండ్ల నరేశ్‌కు కామారెడ్డి జిల్లా అరుగొండ రాజంపేటకు చెందిన సత్యతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. గ్రామంలో బంధువుల పెళ్లి ఉండగా 4రోజుల క్రితం వచ్చారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో సత్య బెడ్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. గమనించిన ఆమె అత్త దుర్గమ్మ తలుపులు తట్టినా తీయలేదు. దీంతో కొడుకు నరేశ్‌కు, ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో వారొచ్చి తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకొని ఉంది. వెంటనే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆమె భర్త నరేశ్‌ మృతురాలి శవాన్ని ఇంటి అరుగుపై పడుకోబెట్టి పారిపోయినట్లు సమాచారం. కాగా మృతురాలు 4నెలల గర్భిణి అని తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డను అల్లుడు నరేశ్‌ హత్య చేశాడని ఆందోళన చేపట్టగా పోలీసులు సముదాయించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement