
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
నర్సాపూర్: భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నర్సాపూర్ మీదుగా శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామానికి వెళ్తుండగా స్థానిక ఆర్‌డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్‌లతో పాటు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పలువురు నాయకులతో పట్టణ శివారులో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను గమనించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఎవరైనా నివసిస్తుంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులు కుంటలను పరిశీలించాలని, పేదల ఇండ్లు కూలిపోతే నివేదిక ఇవ్వాలని సూచించారు.
మంత్రి దామోదర ఆదేశం