
జాతీయ క్రీడలకు విద్యార్థులు ఎంపిక
కొండపాక(గజ్వేల్): కొండపాక హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యా పత్యా జాతీయ క్రీడలకు ఎంపికయ్యారని మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌లో మహారాష్ట్రలో జరిగే జాతీయ క్రీడలకు ఎస్ శరణ్య, ఎం.శ్రీరామ్, సీహెచ్ సాత్విక తెలంగాణ జట్టులో ఎంపికయ్యారు. దీంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా రంగాల్లో విద్యార్థులు రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అనంతుల ప్రశాంత్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అభినందించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు