
చేపల వేటకు వెళ్లి.. అదృశ్యం
కొల్చారం(నర్సాపూర్): చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏషబోయన దుర్గేశ్ ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలోని మంజీరా నదికి చేపల కోసం వెళ్లాడు. సోమవారం సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు సోదరుడు నర్సింహులు పేర్కొన్నాడు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఝరాసంగం(జహీరాబాద్): గ్యాస్ లీకై న ఘటనలో మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా... మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలో ఈనెల 6న గ్యాస్ లీకై మంటలంటుకొని ఒకే కుటుంబంలోని తల్లి శంకరమ్మతో పాటు కుమారులు ప్రభు కుమార్, విట్టల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 6న తల్లి, 15న ప్రభు కుమార్ మృతి చెందారు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న కుమారుడు విట్టల్(32) మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. భార్యతో పాటు కుమారులకు అంత్యక్రియలు నిర్వహించిన తండ్రి బక్కన్న గుండెలవిసేలా ఏడ్చారు.

చేపల వేటకు వెళ్లి.. అదృశ్యం