
బీడీ పరిశ్రమను కాపాడండి
సిద్దిపేటజోన్: గ్రామీణ కుటీర పరిశ్రమ అయిన బీడీ పరిశ్రమను కాపాడాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు సోమవారం తెలంగాణ భారతీయ మాజ్దుర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని జాతీయ బీఎంఎస్ కార్యదర్శి సురేంద్రన్, అఖిల భారత బీడీ మాజ్దుర్ మహా సంఘ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్‌లతో కలిసి ఆయన పలు సమస్యలపై వివరించారు. తెలంగాణలో 10 లక్షల మంది బీడీ కార్మికులన్నారని తెలిపారు. ప్రస్తుతం బీడీలపై 18 శాతం జీఎస్టీ ఉందని, పెంచే ఆలోచన విరమించి 5 శాతానికి కుదించాలని కోరారు.
కేంద్ర మంత్రికి బీఎంఎస్ వినతి