
డ్యామ్‌కు శాశ్వత మరమ్మతులు
సంగారెడ్డి జోన్: సింగూర్ డ్యామ్‌కు శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...డ్యామ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. డ్యామ్ పరిరక్షణకు దేశంలో అత్యున్నత స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అవసరమైన డీపీఆర్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల లైనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సకాలంలో సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెద్ద రెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సర్వే పనులు తదితగతిన పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలన్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాధులు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతుల పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో మంత్రి దామోదర