
ఘనంగా టీఎల్‌ఎం మేళా
సదాశివపేట(సంగారెడ్డి): ఉపాధ్యాయుల బోధనోపకరణాల మేళాను సోమవారం పట్టణంలోని రవీంద్రమోడల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల సముదాయంలో నిర్వహించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ సబ్జెక్టులను వివరించడానికి ఉపాధ్యాయులు ఉపయోగించే వివిధ రకాల బోధనోపకరణాలను మేళాలో ప్రదర్శించారు. పట్టణ, మండల పరిధిలోని 55 పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ రకాల బోధనోపకరణాలు తయారుచేసి ప్రదర్శించగా అందులో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 10 పాఠశాలలు జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ఎంఈఓ శంకర్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్‌ఎన్‌ఓ సుధాకర్, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు జయసుధ, వినయ్‌కుమార్, రాజశ్రీ, నిజాముద్దీన్, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సీఆర్పీలు పాల్గొన్నారు.