
పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ చేసిన దామోదర
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయమైని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబి నుంచి కలెక్టరేట్ వరకు గౌడ్ కులస్తుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్‌పంకజ్, అదనపు కలెక్టర్, చంద్రశేఖర్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.