
పంట నష్టంపై ప్రతిపాదనలివ్వండి
నారాయణఖేడ్: భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి నష్ట పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశమై వివరాలను సేకరించారు. పెసర, మినుము మరో ఇరవై రోజుల్లో చేతికి వచ్చే పరిస్థితి ఉందని, ఈ సమయంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిందని అన్నారు. కంది, పత్తిపంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారులు అక్కడక్కడా దెబ్బతిన్నాయని అధికారులు దృష్టికి తీసుకురాగా వాటి మరమ్మతు పనులకు ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే సూచించారు. లోలెవల్ కాజ్‌వేలు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వివరాలు వెంటనే సేకరించి మరమ్మతులకు ప్రతిపాదించాలని అధికారులు ఆదేశించారు. జనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు.
నల్లవాగు నీటిని వదలండి
నల్లవాగు నీటిని వెంటనే విడుదల చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశించారు. నల్లవాగు ప్రాజెక్టు నిండి అలుగుపైనుంచి వరద నీరు పొంగి పొర్లుతోందని, కుడి, ఎడమ కాలువలద్వారా నీటిని వదలాలని సూచించారు. రైతులు ఆయా చెరువుల్లో వరద నీటిని నింపుకోవాలని సూచించారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని వివరించారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి