
రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి
సంగారెడ్డి జోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...అందోల్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.44కోట్ల నిధులతో నూతన రహదారుల నిర్మాణంతోపాటు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్లు నిర్మాణం, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనం తదితర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ జగదీశ్వర్, ఈఈ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ