
నేడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
సంగారెడ్డి టౌన్: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాని సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్న గౌడ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గౌడ కులస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గణేశ్ మండపాల
వివరాలివ్వండి
జహీరాబాద్ టౌన్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ఆయా మండపాల నిర్వాహకులు సహకరించాలని ఆయా మండపాల వివరాలను అందజేయాలని జహీరాబాద్ టౌన్ పోలీసులు తెలిపారు. మండపాల వివరాలను పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్‌లో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. మండపాల ఏర్పాటు సమాచారం కేవలం భద్రత, బందోబస్తు కోసం మాత్రమేనని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలున్నా పోలీసుల నివృతి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హామీలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు
జోగిపేట(అందోల్): గ్రామపంచాయతీ కార్మి కులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు పేర్కొన్నారు. జోగిపేటలోని శ్రీరామ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఐదవ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేతన పెంపుతోపాటు రెగ్యులర్‌గా చెల్లిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ అధికారం చేపట్టి 18నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.విద్యాసాగర్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు సత్తయ్య, దశరథ్, యాదమ్మ, బాలమణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
జహీరాబాద్ టౌన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 హైదరాబాద్‌లో పీఆర్టీయూ నిర్వహించతలపెట్టిన మహాధర్నా పోస్టర్‌ను ఎమ్మార్పీస్ కార్యాలయం వద్ద ఆదివారం ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు తులసీరాం రాథోడ్ మాట్లాడుతూ...సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయలు తీవ్రంగా నష్టపోతున్నారని, పాత పింఛను విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు పాల్గొన్నారు.

నేడు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ