
అప్రమత్తంగా ఉండండి: మాణిక్‌రావు
న్యాల్‌కల్(జహీరాబాద్): వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల భవనాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని చీకూర్తి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల భవనం, బ్రిడ్జి తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు, పాఠశాల భవనాలు దెబ్బతిని వాహన చోదకులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి మరమ్మతులు చేపట్టాలన్నారు. వర్షాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ పార్టీ న్యాల్‌కల్, ఝరాసంగం మండల అధ్యక్షుడు రవీందర్, వెంకటేశం, మాజీ అధ్యక్షుడు నర్సింహరెడ్డితోపాటు నాయకులు ప్రవీణ్‌కుమార్, భూమారెడ్డి తదితరులున్నారు.
దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే