
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
పటాన్‌చెరు టౌన్: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సూచించారు. శ్రీకృష్ణ జన్మాష్ఠమి నేపథ్యంలో గోకుల్ నగర్‌కు చెందిన ఎట్టయ్య, దేవకుమార్ శనివారం రాత్రి నిర్వహించిన శ్రీకృష్ణుని రథోత్సవం, దేవేంద్రుడి ఉత్సవంలో మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నేత నీలం మధు, కాంగ్రెస్ పార్టీ ప్రొటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి, కర్ణాటక కు చెందిన మల్లికార్జున్ అప్పాజీతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడి రథోత్సవం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పలుకాలనీల మీదగా కన్నుల పండుగగా సాగింది. అనంతరం రుద్రారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రావణ మాసం బండ్ల బోనాల ఉత్సవాలలో మహిపాల్‌రెడ్డి పాల్గొని రూ.లక్ష విరాళం అందజేశారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి