
సమాజ శ్రేయస్సుకు సాహిత్యం అవసరం
పుస్తకావిష్కరణలో దేశపతి శ్రీనివాస్ తదితరులు
సిద్దిపేటకమాన్: సమాజ శ్రేయస్సుకు సాహిత్యం అవసరమని రచయిత, శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన సుకృతి శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల మధ్య నిలిచే వారు శతక కవులని పేర్కొన్నారు. నాగరికత సారాన్ని తత్వంగా, కవిత్వంగా అందించే సృజనకారులు కవి, రచయితలు ముందు నిలుస్తారన్నారు. జీవితాన్ని తపస్సులా భావించి సాగే రచనలు చిరస్థాయిగా నిలుస్తాయని, బాలలకు చిన్నతనంలోనే పద్యాలు నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, అంజయ్య, దుర్గం శ్రీను, గణేశ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.