
ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... కాలనీలోని శ్యామల, యాదగిరి దంపతుల రెండో కుమారుడు ఉప్పు కార్తీక్(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తలుపు తీయగా కార్తీక్ మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. ఈ ఘటనపై విషయం పోలీసులకు సమాచారం అందించగా.. మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డిని వివరణ అడగగా ఆత్మహత్యకు సంబంధించి ఇంకా ఫిర్యాదు అందలేదని చెప్పారు.