
విద్యార్థుల్లో క్రీడాసక్తిని పెంపొందించాలి
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ఆసక్తిని పెంపొందించాలని టెన్నిస్, వాలీబాల్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్ వాంగ్వాడ్ పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని, ఓటమితో నిరాశ చెందకుండా విజయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వాలు క్రీడారంగానికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర టెన్నిస్, వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గణేశ్ మాల్వే, వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ కోరాడే, సిద్దిపేట జిల్లా టెన్నిస్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్‌కే హైదర్‌పటేల్, జిల్లా సెక్రటరీ నవీన్, పీడీ గోవర్ధన్‌రెడ్డి, పీఈటీ నరేశ్ కుమార్, సందీప్, కిరణ్, భాను తదితరులు పాల్గొన్నారు.