
రామకృష్ణకు పద్మచక్ర పురస్కారం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ జాతీయ స్థాయి పద్మచక్ర అవార్డును అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. విద్యా,పర్యావరణ పరిరక్షణ రంగంలో చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణను ఎంఈవో శంకర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం రాజశ్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు అభినందించారు. కార్యక్రమంలో వల్లూరి పౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.