
నారింజ వాగు ఉధృతం
బూచినెల్లి రోడ్డు మూసివేత
జహీరాబాద్ టౌన్: భారీ వర్షాలకు బూచినెల్లి–ఘనాపూర్ గ్రామాల మధ్యన ఉన్న నారింజ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీగా వరద నీరు రావడంతో గేట్లను ఎత్తివేసి నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. దీంతో బూచినెల్లి గ్రామ సమీపంలో ఉన్న నారింజ వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగుపై నిర్మించిన వంతెనపై నుంచి నీరు పారడంతో ప్రమాదాల నివారణ కోసం రోడ్డును మూసేశారు. చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు రోడ్డుకు అడ్డంగా ముళ్ల పొదలు వేసి రాకపోకలను నిలిపేశారు. గత సంవత్సరం వాగును బైక్‌తో దాటుతూ ఒకరు గల్లంతవగా.. మరొకరు ముళ్ల పొదలు పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మండలంలోని అల్గోల్–పోట్‌పల్లి రోడ్డును కూడా జహీరాబాద్ రూరల్ పోలీసులు మూసేశారు.