
అప్రమత్తంగా ఉండండి
ఎస్పీ పరితోశ్ పంకజ్
కొండాపూర్(సంగారెడ్డి): జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కొండాపూర్– తేర్పోల్ గ్రామాల మధ్య గల వాగును పరిశీలించారు. రెండు గ్రామాల మధ్య గల వాగు ఉధృతి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ రహదారి వెంట రాకపోకలు మానుకోవాలని సూచించారు. ప్రజలు ఇటువైపు రాకుండా తగిన ఏర్పాట్లను చేయాలని తహసీల్దార్ అశోక్‌కు సూచించారు. ఎస్పీ వెంట సీఐ సుమన్‌కుమార్, ఎస్‌ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ గంగారం వాగును పరిశీలించారు.