
ఈసీఈలో అరుణ్ జ్యోతికి పీహెచ్‌డీ
పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విభాగం పరిశోధక విద్యార్థిని అరుణ్ జ్యోతి డాక్టరేట్‌కు అర్హత సాధించారు. ‘కమ్యూనికేషన్ అప్లికేషన్ల కోసం డిజిటల్ ఫిల్టర్ల ఎఫ్‌జీఏ ఇంటిగ్రేషన్ కోసం డిజైన్ విధానాలు’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగం ప్రొఫెసర్ జయశ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మంజీరా వంతెన పరిశీలన
హత్నూర (సంగారెడ్డి): మంజీరా నది ప్రవాహం వల్ల హత్నూర మండలం కొన్యాల గ్రామ శివారులోని నదిపై ఉన్న వంతెనను తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి శనివారం సాయంత్రం పరిశీలించారు. వంతెన పై నుంచి వాహనదారులు, ప్రజలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు, పశువుల కాపరులెవరూ మంజీరా పరీవాహక ప్రాంతంలోకి రావొద్దని సూచించారు. కొన్యాలలోని శిథిలావస్థలో ఇళ్లలో నుంచి కుటుంబాలను తరలించారు.
బలవంతంగాభూ సేకరణ చేపట్టొద్దు
కార్మిక సంఘం అధ్యక్షుడు రాంచందర్
జహీరాబాద్ టౌన్: బలవంతంగా భూసేకరణ చేపట్టరాదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలోని శ్రామిక్ భవనంలో శనివారం ఎల్గోయి గ్రామ రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సేకరణ విషయంలో గత ప్రభుత్వం తరహా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిమ్జ్ కోసం గ్రామంలో ఇప్పటికే వేల ఎకరాల భూమిని సేకరించారన్నారు. సేకరించిన భూముల్లో పరిశ్రమల జాడలేదని, తాజా మరో 200 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ వేయడం శోచనీయమన్నారు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో తెలియకుండా పంటలు పండే భూములను తీసుకోవద్దన్నారు. నోటిఫికే షన్‌ను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకలు ఎస్ కుమార్, బి.నర్సింలు, తుల్జరాం, శంకర్, గోపాల్ రైతులు పాల్గొన్నారు.
సంపన్నులకే
స్వాతంత్ర ఫలాలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర ఫలాలు సంపన్నులకే చెందుతున్నాయని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో ‘79 ఏళ్ల భారతదేశ స్వాతంత్య్రం – రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో 200 మంది కోటీశ్వరుల ఆస్తులు కేవలం 40 శాతం మంది ప్రజల ఆస్తితో సమానంగా ఉందన్నారు. ఒక శాతం మంది చేతుల్లో 50 శాతం ఆస్తి పోగు పడిందని, కానీ దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన 42 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు.

ఈసీఈలో అరుణ్ జ్యోతికి పీహెచ్‌డీ