
గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ
శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకునిసంగారెడ్డిలోని మురళీకృష్ణ ఆలయంలో శనివారం ఘనంగా వేడుకలను జరిపారు. వేకువ జామునే స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. మహా హారతి ఇచ్చి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తి గీతాలపై చిన్నారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. సరస్వతి శిశుమందిర్లో విద్యార్థులంతా రాధా కృష్ణుడి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి

గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ