
ఉధృతంగా డబ్బవాగు
తాటిపల్లి డబ్బవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దచల్మెడ, చిన్నచల్మెడ, ఖమ్మంపల్లి గ్రామాల చీలవాగు, పిల్లోడి సవుటాగు, తాటిపల్లి డబ్బవాగు, బొడ్చట్‌పల్లి, లింగంపల్లి గ్రామాల మధ్య కల్వర్టుపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు వ్యవసాయ భూముల్లో నీరు నిలవడంతో పత్తి పంటలు ఎర్రబారుతున్నాయి. గుంతపట్టు భూములలో పత్తి పంటలో నీరు నిల్వ ఉండటంతో పత్తి పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
– మునిపల్లి(అందోల్):