
అలుగులు పారిన చెరువులు
ఎడతెరపి లేకుండా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో అందోల్, వట్‌పల్లి మండలాల్లో చెరువు కుంటలు అలుగులు పారుతున్నాయి. దీంతో పాటు పలుచోట్ల ఇళ్ల గోడలు కూలాయి. పంటలు నీట మునిగాయి. వట్‌పల్లి మండలం కేరూర్ గ్రామంలో ఊరకుంట చెరువు అలుగుపారడంతో పలు కాలనీలకు వెళ్లే రోడ్డు నీట మునిగి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. గౌతాపూర్, ఉసిరకపల్లి గ్రామాల్లో ఇళ్ల గోడలు కూలిపోయాయి. అందోల్ మండలంలోని కన్‌సాన్‌పల్లి పెద్ద చెరువు అలుగు పారడంతో చేపల కోసం గ్రామస్తులు పరుగులు తీశారు. భారీ వర్షాంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి.
– వట్‌పల్లి(అందోల్):