
పంట కాల్వకు గండి
సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం రాత్రి డ్యాం ఎగువ భాగం నుంచి వరద నీరు రావడంతో 6, 8, 9, 10, 11 నంబర్ గేట్‌లను ఎత్తి 43,176 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 68,185 క్యూసెక్కుల వరద రాగా.. ప్రాజెక్టులో 22 టీఎంసీలకు నిల్వ ఉంచి మిగతా నీటిని వదిలి పెడుతున్నారు. పర్యాటకులను డ్యాం పైకి రానీయకుండా పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇసోజిపేట వద్ద కాల్వకు గండి పడింది. అలాగే.. ముదిమాణిక్యం వద్ద కాలువ నీరు పొంగి పొర్లడంతో వరి చేలు మునిగిపోయాయి. వంద ఎకరాల్లో పంట మునగడంతో రైతులు ఆందోళన చెందారు.
– పుల్‌కల్(అందోల్)