
మూడు రోజుల్లో నీరు విడుదల
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు ఆయకట్టు కింద పంటల సాగుకోసం చర్యలు తీసుకున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. శనివారం నల్లవాగు ప్రాజెక్టును సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల సాగు కోసం చర్చించారు. నల్లవాగు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తు తం కృష్ణాపూర్ వరకు కాల్వల్లో పనులు పూర్తి చేశామని చెప్పారు. చివరి ఆయకట్టు కల్హేర్ వరకు కాల్వల్లో పనులు చేస్తామన్నారు. ప్రాజెక్టులో ప్రస్తు తం 1,488 ఫీట్లు నీటి నిల్వ ఉందన్నారు. మరో మూడు రోజుల్లో ఆయకట్టు కింద పంటల సాగు కోసం నీటి విడుదల చేస్తామన్నారు. రైతులు పంటల సాగుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో ఏఈ శివధర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జైరాజ్, గంగారాం పాల్గొన్నారు.
నల్లవాగు ఆయకట్టు కిందసాగుకు ఏర్పాట్లు చేసుకోండి
రైతులతో ఎమ్మెల్యే సంజీవరెడ్డి