
సమగ్రాభివృద్ధి
న్యూస్‌రీల్
వర్షాలకు అప్రమత్తంగా ఉన్నాం..
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఆర్థిక భరోసా..
నెహ్రూ, ఇందిర స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : పేదలకు ఆర్థిక భరోసాకు సంక్షేమపథకాలు అందజేయడంతోపాటుగా అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి దామోదర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
అన్నదాతలను ఆదుకునేందకు..
‘‘అన్నదాతలను ఆదుకునేందుకు జిల్లాలో రూ.910 కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. రైతుభరోసా పథకం కింద ఈ వానా కాలం సీజనులో 3.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.422 కోట్లు జమ చేశాం. ఉచిత విద్యుత్ పథకం కింద జిల్లాలో 1.06 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతున్నారు. భూ భారతి పోర్టల్ అమలులో భాగంగా 596 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులు ఇచ్చిన 991 దరఖాస్తులను పరిష్కరించాం. జిల్లాలో త్వరలో 206 మంది అర్హులైన అభ్యర్థులకు గ్రామపాలన అధికారులుగా నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేస్తాం..’’అని దామోదర పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలన కోసం..
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పథకాలను అమలు చేస్తున్నాం. 14,391 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 2.11 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. 13.08 లక్షల రేషన్‌కార్డుదారులకు ప్రతీనెలా 8,345 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో కొత్తగా 31,460 రేషన్‌కార్డులు జారీ చేశాం..’’అని రాజనర్సింహ చెప్పారు.
వైద్యం.. విద్య..
‘‘రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 11,691 మందికి రూ.35.15 కోట్ల ఖర్చు చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించాం. త్వరలో సంగారెడ్డి మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించి 500 పడకల ఆసుపత్రిభవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. ఆందోల్‌లో నర్సింగ్ కాలేజీ తరగతులను ప్రారంభించాం. రూ.600 కోట్లతో ఆందోల్, నారాయణఖేడ్, పటాన్‌చెరుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించబోతున్నాం. రూ.107 కోట్లతో రాయికోడ్, నారాయణఖేడ్, జహీరాబాద్‌లలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’’అని మంత్రి అన్నారు.
రోడ్లు భవనాలు.. నీటి పారుదల..
నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానించేందుకు రూ.293 కోట్లతో రోడ్లు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ 2025–26 ఏడాదిలో రోడ్ల మరమ్మతులకు రూ.22 కోట్లు మంజూరయ్యాయి. తాటిపల్లి – మక్తక్యాసారం రోడ్డుకు కలుపుతూ సింగితం నుంచి కోడూర్ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ.42 కోట్లు మంజూరయ్యాయి. రూ.17.70 కోట్లతో గార్లపల్లి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. హెచ్‌ఏఎం పథకం కింద 343 కి.మీల పొడవైన రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.’’అని మంత్రి ప్రకటించారు.
మహిళా సాధికారత కోసం..
‘‘రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పలు పథకాలను అమలు చేస్తున్నాం. మహిళలతో సోలార్ విద్యుత్‌ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్ విజయవంతంగా నడుస్తోంది. ఉచిత బస్సు పథకంలో భాగంగా ఇప్పటివరకు 3.62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేశారు. ’’అని మంత్రి వివరించారు.
త్వరలో 206 మంది గ్రామ పరిపాలన అధికారుల నియామకం
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి దామోదర
‘‘భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేశాం. మాదక ద్రవ్యాల నిర్మూలనకై సంగారెడ్డి నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.’’అని మంత్రి దామోదర పేర్కొన్నారు. టీజీఐఐసీ రాష్ట్ర చైర్మన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్‌పంకజ్, అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి

సమగ్రాభివృద్ధి