యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలే: దేవ్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలే: దేవ్‌ కుమార్‌

Aug 16 2025 8:59 AM | Updated on Aug 16 2025 1:56 PM

వెల్దుర్తి(తూప్రాన్‌): యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్‌ హెచ్చరించారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం ఆగ్రోస్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్‌ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్‌, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు.

చిలప్‌చెడ్‌లో 14.6సెం.మీ వర్షం

చిలప్‌చెడ్‌(నర్సపూర్‌): చిలప్‌చెడ్‌ మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 14.6 సెం.మీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు మండల గణాంకాధికారి దివ్యభారతి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, కురుస్తున్న భారీ వర్షాలకు చిలప్‌చెడ్‌ మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. చిలప్‌చెడ్‌లో కురిసిన వర్షానికి పాక్షికంగా కూలిన ఇళ్లు తహాశీల్దార్‌ సహాదేవ్‌ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సునీల్‌సింగ్‌ ఉన్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికులకు హక్కులు సాధిస్తాం

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కాంట్రాక్ట్‌ కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా యా జమాన్యాల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. శుక్రవారం సంగారెడ్డిలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలపై జరిగిన క్యాంపెయిన్‌ వర్క్‌ షాప్‌నకు రామయ్య హాజరై మాట్లాడారు. కాంట్రాక్ట్‌ కార్మికుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తామని తెలిపారు.

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా భాస్కర్‌

జహీరాబాద్‌ టౌన్‌: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జహీరాబాద్‌ పట్టణానికి చెందిన గొల్ల భాస్కర్‌ నియమితులైయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షురాలు గోదావరి శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన భాస్కర్‌ను పలువురు బీజేపీ నాయకులు అభినందించారు.

చినుకుపడితే కరెంట్‌ కట్‌.. సరఫరాలో తీవ్ర అంతరాయం

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో కరెంటు సరఫరాలో అంతరాయం సాధారణమైందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రతి రోజు కరెంట్‌ కోతలు ఉంటున్నాయని, చినుకు పడితే కరెంటు పోతుందని, మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. రెండు రోజులుగా కరెంట్‌ సరఫరాలో అంతరాయం మరింత ఎక్కువైందని స్థానికులు తెలిపారు. శుక్రవారం సైతం కరెంటు చాలా సార్లు పోయిందని అన్నారు. కరెంట్‌ ఎక్కువ సార్లు పోవడంతో విద్యుత్తు పరికరాలు పాడుతున్నాయని అన్నారు. పట్టణంలో కరెంటు సరఫరాను మెరుగు పర్చాలని వినియోగదారులు కోరుతున్నారు.

కాంట్రాక్ట్‌ కార్మికులకు హక్కులు సాధిస్తాం1
1/1

కాంట్రాక్ట్‌ కార్మికులకు హక్కులు సాధిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement