
అర్హులకు సంక్షేమ ఫలాలు
సంగారెడ్డి జోన్: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టరు ప్రావీణ్య సూచించారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌తోపాటు క్యాంపు కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...స్వతంత్ర సమయరయోధుల స్ఫూర్తితో ఉద్యోగులు తమ విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, తదితరులు పాల్గొన్నారు.
దేశ రక్షణ అందరి బాధ్యత
దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్యగౌడ్, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణుగోపాల్‌రెడ్డి, ఎఆర్.డీఎస్పీ.ఎ.నరేందర్ పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరణ