
మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద పెరగడంతో మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో శుక్రవారం డ్యామ్‌లోకి 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 8,9, 11 నంబర్ గేట్‌లను మీటరున్నర మేర ఎత్తి దిగువకు 20,250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జలవిద్యుత్ కేంద్రానికి 2,500 క్యూసెక్కుల నీరు వదలటంతో రెండు టర్బయిన్‌లను రన్ చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
పర్యాటకుల సందడి
ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదలటంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. జంట నగరాలతోపాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి పర్యాటకులు వచ్చారు.
జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
పర్యాటకుల సందడి