
కాంగ్రెస్‌కు జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజీనామా
పార్టీలో ఆదరణ లేదని మనస్తాపం
పెద్దశంకరంపేట(మెదక్): కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని మనస్తాపం చెందిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అవుసుల భవాని శుక్రవారం తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గెలుపుకోసం ఎంతగానో కృషి చేశానని, పార్టీ నిర్వహించే కార్యక్రమంలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.