
స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం
సంగారెడ్డి జోన్: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను గురవారం పర్యవేక్షించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలతోపాటు జాగిలాలతో ఏర్పాట్లను పరిశీలించారు. పంద్రాగస్టు వేడుకకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై ఉదయం 9:30 నిమిషాలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేయనున్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల శకటాలను ప్రదర్శించనున్నారు. విశిష్ట సేవలకు ఎంపికైన ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన
జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్
వేడుకలకు హాజరుకానున్న మంత్రి దామోదర