
మంజీరా పరవళ్లు
సింగూర్ డ్యామ్ నుంచి కిందికి నీళ్లు వదలటంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు మంజీరా డ్యామ్ నిండుకుండలా మారింది. బుధవారం నాటికి మంజీరా డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో గురువారం ఎనిమిదవ గేట్‌ను రెండున్నర మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో మంజీరా నీళ్లు పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతున్నాయి. దిగువన నీరు ప్రవహించే ఏరు నిండుగా కళకళలాడుతుంది.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి