మహనీయుల త్యాగ ఫలమే.. స్వాతంత్య్రం | - | Sakshi
Sakshi News home page

మహనీయుల త్యాగ ఫలమే.. స్వాతంత్య్రం

Aug 15 2025 11:30 AM | Updated on Aug 15 2025 11:30 AM

మహనీయుల త్యాగ ఫలమే.. స్వాతంత్య్రం

మహనీయుల త్యాగ ఫలమే.. స్వాతంత్య్రం

దిశ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ కుమార్‌

ఆకట్టుకున్న తిరంగా ర్యాలీ

దుబ్బాకటౌన్‌: ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్య్ర ఫలాలని జిల్లా దిశ కమిటీ సభ్యుడు సుంకోజీ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలో బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు, బీజేపీ నాయకులు 150 మీటర్ల త్రివర్ణ పతాకంతో పట్టణంలోని పుర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భాగంగా దేశ భక్తి నినాదాలతో పట్టణ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్‌ రెడ్డి, మల్లారెడ్డి, రవి కుమార్‌, రమణా రెడ్డి, రమేష్‌ రెడ్డి, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement