
దేశభక్తి.. స్వాతంత్య్ర స్ఫూర్తి
తూప్రాన్: పట్టణంలోని గీతా స్కూల్ విద్యార్థులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా చేపట్టిన ప్రదర్శన ఆకట్టుకుంది. గురువారం సుమారు 300 మంది విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో త్రివర్ణ పతాకం ఆకృతిలో కూర్చుని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటారు. అంతేకాకుండా జెండాకు ఇరువైపుల జాతీయ పుష్పం ‘కమలం’ ఆకారంలో కూర్చుని అలరించారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశభక్తిని చాటారు. ఈ మేరకు విద్యార్థుల ప్రదర్శనను పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు ప్రశంసించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ ఉష , డైరెక్టర్లు రాఘవేందర్‌గౌడ్, నారాయణగుప్త, ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.