
ఆహా ఏమి రుచి..!
జహీరాబాద్ టౌన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో గురువారం వంటలు, ముగ్గులు, మెహిందీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ శాంత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలకు చెందిన 106 మంది విద్యార్థులు పోటీ పడి నోరూరించే పలు రకాల వంటకాలు తయారు చేశారు. ఇందులో చిరుధాన్యాలతో ఘుమఘుమలాడే బిర్యానీ, జీరారైస్, ఫులిహోర, దోశలు, ఇడ్లీ, గారెలు, పాయసం, పలు రకాల స్వీట్లు, జోన, సజ్జ రొట్టెలు వంటి వైరటీ వంటకాలు తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ హరికుమార్, డైరక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపకులు కీర్తి, రమేష్, దత్తు, నవీన లావణ్య, శ్రావణి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలతో
నోరూరించే వంటకాలు