
అధిక వర్షాలతో అప్రమత్తం
కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి ప్రజలకు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికారులకు సెలవులను మంజూరు చేయడం లేదని, అన్ని స్థాయిల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఏదైనా సమస్య వస్తే 08457–230000ను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.