కుక్కను కొట్టిన వారిపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కుక్కను కొట్టిన వారిపై ఫిర్యాదు

Aug 13 2025 7:44 AM | Updated on Aug 13 2025 7:44 AM

కుక్కను కొట్టిన వారిపై ఫిర్యాదు

కుక్కను కొట్టిన వారిపై ఫిర్యాదు

పటాన్‌చెరు టౌన్‌: వీధి కుక్కను కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. డివిజన్‌ పరిధి రాఘవేంద్రకాలనీ సమీపంలో ఓ వీధికుక్కను కాళ్లు కట్టేసి రాంసింగ్‌, మరో వ్యక్తి రాడ్డుతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆ కుక్కను వారి వెంట తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా జంతు క్రూరత్వ నివారణ సహాయకురాలు ప్రీతి ఈ ఘటన చూసి వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీధికుక్కపై దాడి చేస్తున్న రాంసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement