●
పకడ్బందీగా నిర్వహిస్తాం
జిల్లాలో క్రీడాపోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్వహణ కోసం మండలానికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈనెలలో మండల స్థాయి పోటీలు పూర్తి చేసి, సెప్టెంబర్‌లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తాం. తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయి.
– వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి
ఎస్పీ
పరితోష్ పంకజ్
సంగారెడ్డి జోన్: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌పై సమీక్ష నిర్వహించి, టీషర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైబర్ నేరాల కట్టడికి అవగాహన ఒక్కటే మార్గమని, అందుకు ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సైబర్ వారియర్స్ ఫోన్ కాల్స్‌కు త్వరితగతిన స్పందించి, బాధితులకు కచ్చితమైన సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ వర్టికల్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేయాలని సుచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, సైబర్ సెల్ సిబ్బంది ఉన్నారు.
అవగాహనతోనే సైబర్ నేరాల కట్టడి