సెర్ప్‌లో స్థానచలనాలు | - | Sakshi
Sakshi News home page

సెర్ప్‌లో స్థానచలనాలు

May 17 2025 8:15 AM | Updated on May 17 2025 8:15 AM

సెర్ప్‌లో స్థానచలనాలు

సెర్ప్‌లో స్థానచలనాలు

జిల్లా వివరాలు

రాష్ట్ర ఉద్యోగులకు నివేదిక

దిలీ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను రాష్ట్రస్థాయి ఉద్యోగులకు నివేదిక పంపనున్నారు. ఉద్యోగులలో పేరు మార్పు లు, తప్పులు ఉంటే వాటి వివరాలు సైతం ఫిర్యాదు రూపంలో స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విధివిధానాలతో కూడిన జీఓ జారీ కాగానే నియమ నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. కొన్నేళ్లుగా ఉద్యోగులు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈనెలాఖరుకు బదిలీల ప్రక్రియ పూర్తి కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే వాటిని అనుసరించి కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. ఇక జిల్లాలో ఏర్పడిన మండలాలకు సైతం అధికారులను నియమిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో సెర్ప్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్‌ ఉద్యోగులతోపాటు ఉపాధి హామీ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి చర్యలు ప్రారంభించింది. దీంతో కొన్నేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న అధికారులు బదిలీ కానున్నారు. అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట కలగనుంది. అన్ని రకాల ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. త్వరలోనే బదిలీలకు సంబంధించిన జీఓ జారీచేయనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.

పదేళ్ల అనంతరం బదిలీలు

సెర్ప్‌ ఉద్యోగులకు 2015 సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి బదిలీల ప్రక్రియ చేపడుతున్నారు. వాస్తవానికి 2018లో కొంతమేర బదిలీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. సుమారు పదేళ్ల అనంతరం ఎట్టకేలకు ఉద్యోగుల బదిలీ ప్రక్రియను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఈ విభాగంలో 192మంది అధికారులు వివిధ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 40మంది ఉద్యోగులు జిల్లా కేంద్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా, 151 మంది మండలస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఉద్యోగి డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా ఒకే దగ్గర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు.

జిల్లాలోని సెర్ప్‌ ఉద్యోగుల వివరాలు

ఉద్యోగి స్థాయి జిల్లా కేంద్రంలోఅధికారులు మండల స్థాయిలో

అదనపు డీఆర్‌డీఓ 1 0

డీపీయం 4 0

ఏపీయం 7 24

కమ్యూనిటీ కోఆర్డినేటర్స్‌ 16 127

సపోర్టింగ్‌ స్టాఫ్‌ 12 0

2015 ఏడాది తర్వాత ప్రక్రియ

రాష్ట్ర అధికారులకు

జిల్లా ఉద్యోగుల వివరాలు

జిల్లాలో 192 మంది ఉద్యోగులు

ఈ నెలాఖరుకు

పూర్తి కానున్న బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement