
ఏపీ ఈసెట్‌లో సత్తా చాటిన విద్యార్థినులు
మిరుదొడ్డి(దుబ్బాక): ఏపీ ఈసెట్ ఫలితాల్లో ఒకే మండలం ఒకే గ్రామానికి చెందిన విద్యార్థినులు ప్రభంజనం సృష్టించారు. ఇటీవల విడుదలైన రాష్ట్రస్థాయి ఫలితాల్లో మొదటి, రెండవ ర్యాంకులను సాధించి ఔరా అనిపించారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట –భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కట్లె యాదగిరి, కవిత దంపతుల కూతురు రేవతి, అలాగే పంజ నర్సింలు, చె న్నవ్వల కూతురు నవ్య ఏపీ ఈసెట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఈసీఈ విభాగంలో మొదటి, రెండో ర్యాంకులు సాధించి జిల్లాకే తలమానికంగా నిలిచారు.
కూలి కుటుంబంలో ఆణిముత్యాలు
రెక్కాడితే గాని డొక్కాడని కూలీ కుటుంబంలో జన్మించిన రేవతి, నవ్య టీఎస్‌ఆర్‌జేసీ ఎన్సానపల్లిలో పది వరకు చదివి గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సికింద్రాబాద్‌లో డిప్లొమా పూర్తి చేశారు. రేవతి తండ్రి వ్యవసాయ కూలీ పనులు చేయగా తల్లి బీడీలు చుడుతూ తన బిడ్డను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అలాగే పంజ నర్సింలు చెన్నవ్వల కూతురు నవ్యను హమాలి, వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదివిస్తున్నారు. తల్లిదండ్రులు తమ చదువు కోసం పడుతున్న కష్టాలకు చలించి ఉన్నత చదువులే లక్ష్యంగా చదివి కలల సాకారాన్ని సాధించుకున్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల విద్యార్థిలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సొంతం