
కానిస్టేబుల్ దాడి చేశాడంటూ ఆందోళన
హుస్నాబాద్: హనుమాన్ మాల ధరించిన భక్తుడిపై ఎకై ్సజ్ కానిస్టేబుల్ దాడి చేశారంటూ శుక్రవారం ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట మాలధారులు ధర్నా చేశారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఽఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ మాల ధరించిన శివప్రసాద్ పట్టణంలోని ఓ వైన్స్ షాపునకు సంబంధించిన సిట్టింగ్ పర్మిట్ రూంలో పని చేస్తున్నాడని తెలిపారు. అయితే మద్యం తాగేందుకు ఎకై ్సజ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి పర్మిట్ రూంకు వచ్చాడు. గ్లాసులు కావాలని కోరగా, శివప్రసాద్ గ్లాస్‌లు ఇచ్చి డబ్బులు అడిగాడు. నేను ఎవరో తెలుసా, డబ్బులు అడుగుతావా.. వైన్స్ షాఫును సీజ్ చేయిస్తానని బెదిరించి శివ ప్రసాద్‌పై దాడి చేశాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మాలధారులు ధర్నా నిర్వహించి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సై మహేష్ వచ్చి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటానని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్ గౌడ్, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, మాలధారులు ఉన్నారు.
ఎకై ్సజ్ ఆఫీస్ ఎదుట
హనుమాన్ మాలధారుల ధర్నా