
ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ
మెదక్ కలెక్టరేట్ : ఉపాధ్యాయులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను రిసోర్స్‌పర్సన్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే బడి బయట ఉన్న పిల్లలను బడిబాటలో భాగంగా పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాలలకు నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందించాలని మండల విద్యాధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం పోషకుల సమావేశం నిర్వహించి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన మూర్తి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బడీడు పిల్లలంతా బడిలో చేరాలి
స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్