
అనుమతి లేకుండా నిర్మిస్తే చర్యలే
● అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ● బోరుపట్లలో పరిశ్రమల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా అధికారుల బృందం
హత్నూర (సంగారెడ్డి): అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్ప వని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశ్రమల ప్రతినిధులను హెచ్చరించారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని ఎపిటోరియా పరిశ్రమ, నూతనంగా నిర్మిస్తున్న తెరనియం బైలోజీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఏస య్య, డీఈ రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి గీతతో కూడిన అధికారుల బృందం ఆ పరిశ్రమల అక్రమ నిర్మాణాలను గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ...పరిశ్రమలు నిర్మాణాలు చేపడితే ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎపిటోరియా పరిశ్రమకు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. రెండు రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.