
స్టాక్ మార్కెట్ పేరిట సైబర్ మోసం
రూ.21.6 లక్షలు పోగొట్టుకున్న
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
పటాన్‌చెరు టౌన్: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ స్టాక్ మార్కెట్ పేరిట సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి బురిడీ కొట్టించి నగదు కాజేశారు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సూర్యోదయ కాలనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి మార్చి 25న వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. అతడు తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత స్టాక్ మార్కెట్ నిర్వాహకులు ఐడీని క్రియేట్ చేసి ఇవ్వగా ఆన్‌లైన్‌లో నగదు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. మొత్తం రూ.21.06 లక్షలు పెట్టుబడి పెట్టాడు. బాధి తుడు తాను పెట్టిన నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. తాను మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
హోటల్‌పై విరిగిపడిన చెట్టు
తృటిలో తప్పిన ప్రమాదం
టేక్మాల్(మెదక్): టేక్మాల్ మండలంలో మంగళవారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు బొడ్మట్‌పల్లి చౌరస్తాలో ఓ చెట్టు విరిగి గ్రామానికి చెందిన ఉప్పు నర్సప్ప హోటల్‌పై పడింది. హోటల్‌లో ఐదుగురు ఉండగా తృటిలో ప్రమాదం తప్పింది. హోటల్ ఉన్న సామగ్రి రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బుధవారం ఉదయం ఆర్‌ఐ సాయి శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. హోటల్ ఆధారపడి జీవిస్తుండగా పూర్తిగా కూలిపోవడంతో రోడ్డున పడ్డారని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
వెల్దుర్తి(తూప్రాన్) : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ట్రైనీ ఎస్సై జ్యోతి, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మర్కంటి సుశీల మంగళవారం బంధువుల ఇంటికి వెళ్లగా కుమారుడు ఈశ్వర్ ప్రైవేట్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం ఈశ్వర్ ఇంటికొచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 20 తులాల వెండి వస్తువులతోపాటు రూ.30 వేలు నగదును దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అదే విధంగా గ్రామానికి చెందిన ఖాజాపూర్ దుర్గయ్య ఇంటి తాళాలు పగులగొట్టగా చుట్టుపక్కల వారు మేల్కొనడంతో దుండగులు పరారయ్యారు.
వ్యక్తి హత్య కేసులో
నిందితుడి అరెస్ట్
సంగారెడ్డి క్రైమ్: వ్యక్తి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ రమేశ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నేతాజీ నగర్‌కు చెందిన పాండరి రాజు 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అదే కాలనీకి చెందిన రాజవేళి ఈశ్వర్‌పై వచ్చిన అనుమానంతో ప్రత్యేక టీమ్ అతడిపై నిఘా పెట్టింది. బుధవారం పాత బస్టాండ్ సమీపంలోని మండే మార్కెట్ కల్లు కాంపౌడ్‌లో అదుపులోకి తీసు కొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. రాజు తనకు డబ్బులు ఇవ్వాలని, ఇవ్వ కపోవడంతో కక్ష పెంచుకొని 10న శనివారం రాత్రి మద్యం సేవించిన అనంతరం రాజుకు ఫోన్ చేసి రాజీవ్ పార్క్‌కి రమ్మని చెప్పానన్నాడు. సున్నీతో రాజు గొంతు నులిమి, పక్కనే ఉన్న బండరాయితో ముఖంపై కొట్టి హత్య చేసినట్లు తెలిపాడు. మృతుడి భార్య హారతి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రి మాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

స్టాక్ మార్కెట్ పేరిట సైబర్ మోసం