
అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తే కటకటాలకే?
మెదక్ మున్సిపాలిటీ: సోషల్ మీడియాలో ఇక పై అశ్లీల పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని మెదక్ పట్టణ సీఐ నాగరాజు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. యువత గూగుల్‌లో ఫోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసి ఎఫ్‌బి, ఇనస్ట్రాగామ్‌లలో పోస్టు పెడుతున్నారని, ఎలాంటి వారి పై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా పెట్టిందన్నారు. మెదక్ పట్టణంలో బీటెక్ విద్యార్థి అశ్లీల వీడియో పోస్టు చేస్తే ఆ యువకుడి పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే జిల్లాలో టేక్మాల్, చిన్న శంకరం పేట, తూప్రాన్‌లలో ఫోర్న్ వీడియోలు పోస్టు చేసిన వారి పై కేసులు నమోదయ్యాయని తెలిపారు. యువత అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా వీడియో పోస్టు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేయాలని సూచించారు. తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు.
మెదక్ పట్టణంలో బీటెక్ విద్యార్థిపై కేసు
జిల్లాల్లో మరో మూడు చోట్ల కేసులు
మెదక్ పట్టణ సీఐ నాగరాజు