
డ్రంకెన్ డ్రైవ్‌లో 72 కేసులు
సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బంది నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 72 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో బుధవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా నివారణకు వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నా రు. 72 డ్రంకెన్ డ్రైవ్ కేసులతోపాటు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై 299 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తనిఖీల్లో సిద్దిపేట ఏసీపీ మధు, వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూ టౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట సీపీ అనురాధ