
రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు
టేక్మాల్(మెదక్): రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలైన ఘటన టేక్మాల్ మండలంలోని బొడ్మట్‌పల్లి 161 హైవేపై బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అల్లాదుర్గం గ్రామా ని కి చెందిన వడ్డె బేతయ్య, ఆయన భార్య శ్రీలత బైక్‌పై సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. వెనుకాల నుంచి బొలేరో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. మళ్లీ కారు ఢీకొట్టడంతో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి టేక్మాల్ పోలీసులు చేరుకొని వివరాలను సేకరించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.