
ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్య
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులతో ఇరిగేషన్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి–2 కథనం మేరకు.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన మోడబోయిన రామకృష్ణ(35) సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్‌కి సంబంధించి ఇరిగేషన్ శాఖలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రామకృష్ణ ప్రైవేట్ సంస్థల్లో రుణం తీసుకున్న కారణంగా వచ్చే జీతం పూర్తిగా రుణం తీసుకున్న దానికి అసలు, వడ్డీ సరిపోతుండేది. ఇల్లు గడవం కష్టంగా మారడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో నిత్యం మనస్తాపానికి గురయ్యేవాడు. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణం తీసుకున్న విషయం తెలియజేయలేదు. తనలో తానే మదనపడుతుండేవాడు. బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య అఖిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు కిందపడి వ్యక్తి
జహీరాబాద్ టౌన్: గుర్తు తెలియని వ్యక్తి జహీరాబాద్– వికారాబాద్ మధ్య నడిచే రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోహీర్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పకి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాగుడుకు బానిసై వ్యక్తి
నర్సాపూర్ రూరల్: తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్‌ఐ లింగం కథనం మేరకు.. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వాల్మీకి అవినాష్ (29) నిత్యం భార్యతో ప్రతిమతో గొడవ పడుతున్నాడు. తాగుడుకు డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులే కారణం